Sachin Tendulkar: ఆ ఊరికి సచిన్ దేవుడు...ఎందుకో తెలుసా..? ఒకప్పుడు ఇది ఓ మారుమూల గ్రామం. కనీస సౌకర్యాలు లేని పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని కోరిన పట్టించుకునే నాధుడే లేడు. రోడ్లు డ్రైనేజీ విద్యుత్ తదితర కనీస వసతులు లేని పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. నెలల వ్యవదిలోనే లోనే అన్ని సౌకర్యాలు సమకూరాయి. ఇది ఎలా అంటారా అయితే తిరుపతి-నెల్లూరు ఉమ్మడి జిల్లాకు వెళ్లాల్సిందే.. By Vijaya Nimma 06 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Sachin Tendulkar adopted Village Kandriga: వెంకటగిరి గూడూరు మధ్య మార్గంలో ఉండే ఈ గ్రామం పేరు పుట్టంరాజువారి కండ్రిగ (Kandriga in Puttamraj). దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు కనీస వస్తూ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో సమస్యల వలయంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇది కూడా ఒకటిగా మారిపోయింది. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, బడి లాంటి కనీస వసతుల విషయంలోనూ వెనకడుగులో ఉండేది. ఈ పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోని ఈ గ్రామాన్ని అందరూ గుర్తు తెచ్చుకునేలా ఓ మార్పు జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటెంలో వచ్చాయి. Your browser does not support the video tag. అసలు సచిన్‌కి ఈ గ్రామానికి సంబంధం ఏమిటి..? అన్న ఆలోచన అందరికీ వచ్చింది. అప్పట్లో జాయింట్ కలెక్టర్ (Joint Collector)గా పని చేసిన రేఖారాణి (Rekha rani) నెల్లూరు జిల్లాలో ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సచిన్ టెండుల్కర్ విమాన ప్రయాణం సమయంలో కోరింది. దీనికి సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సానుకూలంగా స్పందించారు. ఓ గ్రామాన్ని ఎంపీ హోదాలో దత్తత (Adopted) తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గూడూరు రూరల్ మండలంలో ఉన్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని ఎంపిక చేశారు. సచిన్ టెండూల్కర్ ఈ గ్రామ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలను వెచ్చించారు. దీంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. అందమైన ముఖ ద్వారంతో పాటు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వీధిలైట్లు, విద్యుత్ సౌకర్యం, ఇంటింటికి కుళాయి, కమ్యూనిటీ హాలు, వర్మి కంపోస్ట్ యూనిట్ ఇలా అనేక సౌకర్యాలు నెలల వ్యవధిలోనే సమకూరాయి. సౌకర్యవంతమైన జీవనం దీంతో గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. ప్రతి ఇంటికి సచిన్ టెండూల్కర్ బోర్డు పెట్టుకున్నారు. ఆయన మా దేవుడు అంటూ.. ఉప్పుంగిపోయారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)రెండుసార్లు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడే పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామానికి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయనతో కలిసి నడిచిన క్షణాలు మాట్లాడిన మాటలు అన్నీ ఇప్పటికే గ్రామస్తులు నెమరు వేసుకుంటూనే ఉన్నారు. ఆయన నిధులతో ఏర్పాటైన వసతులతో ఇప్పటికీ సౌకర్యవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆస్తులన్ని ఆమెకే.. కడప కానిస్టేబుల్ సూసైడ్ నోట్‌లో సంచలనం #sachin-tendulkar #rtvlive-com #sachin-tendulkar-adopted-village #puttamraju-kandriga #sachin-adopted-kandriga మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి