Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు!

శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు!
New Update

శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.

ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఇక నైనా భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

శబరిమల యాత్రకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా..స్వామి ఆలయంతో పాటు మలికప్పురం దేవి ఆలయాలకు ప్రధాన అర్చకులను నియమించడం జరిగింది. మూలాల ప్రకారం..మువాట్టుపుజా సమీపంలో పుటిల్లత్‌ మనాకు చెందిన మహేష్‌ పీ.ఎన్‌ ను అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారిగా, గురువాయూర్‌ సమీపంలోని అంజూర్‌ పూంగట్‌ మనాకు చెందిన పీ.జీ మురళిని మలికప్పురం దేవి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఎన్నుకున్నారు.

Also read: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!

పందలం వంశలోని ఇద్దరు చిన్నారులతో డ్రా తీయించగా వీరిద్దరూ ఎంపికైనట్లు ఆలయాధికారులు తెలిపారు. మహేశ్‌ ప్రస్తుతం త్రిశూర్‌ లోని పరమేకవు ఆలయ ప్రధాన అర్చకుడిగా చేస్తుండగా, పీ.జీ మురళీ హైదరాబాద్‌ సోమాజిగూడలోని అయ్యప్ప ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు.

ట్రావెన్‌ కోర్‌ దేవస్థాన బోర్డులో వీరు ఏడాది పాటు ప్రధాన అర్చకులుగా ఉంటారు. ఈ ఏడాది శబరిమల యాత్ర నవంబర్‌ 17 నుంచి ప్రారంభం కానుంది. అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి స్పెషల్‌ ట్రైన్లు నడపాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు రైల్వే అధికారులను కోరారు.

ఈ మేరకు ఆయన రైల్వే అధికారులకు లేఖ రాశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు ఏటా అయ్యప్ప మాల వేసుకుంటారు. 41 రోజుల తరువాత ఇరుముడితో అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్తుంటారు. వారికి సరిపడ రైళ్లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి సంక్రాంతి వరకు ఎర్నాకుళం , కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీలో లేఖలో రైల్వే అధికారులకు వివరించారు. విశాఖ- వారణాసి ఎక్స్‌ప్రెస్‌ రైలును వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో విన్నవించారు.

ఈ రైలుకు ‘కాశీ అన్నపూర్ణ ఎక్స్‌ప్రెస్‌’గా నామకరణం చేయాలని సూచించారు. దీనివల్ల భక్తులు సులభంగా రైలును గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు.

Also read: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?

#sabarimala #kerala-highcourt #rules
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి