Sabarimala: నేడు శబరిమల ఆలయం మూసివేత!

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఈరోజు శబరిమల ఆలయం మూసివేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆలయంలో మండలపూజ జరగనున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు అధికారులు మూసివేయనున్నారు.

Sabarimala: నేడు శబరిమల ఆలయం మూసివేత!
New Update

Sabarimala Closed Today: ఈ రోజు శబరిమల ఆలయం మూసివేయడం జరుగుతోంది. ఇవాళ ఆలయంలో మండలపూజ జరగనుంది. రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు అధికారులు మూసివేయనున్నారు. చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా అయ్యప్పల భక్తుల వస్తున్నారు, అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతుందని అక్కడి అధికారులు తెలిపారు.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

గత కొన్న రోజులుగా శబరిమల అయ్యప్ప దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో అదుపు చేసేందుకు పోలీసులు, ఆలయ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది భక్తుల కారణంగా 39రోజుల శబరిమల ఆధాయం రూ. 200కోట్లు దాటింది. 39రోజుల క్రితం ప్రారంభం అయిన అయ్యప్ప దర్శనంలో భాగంగా ఇప్పటివరకు 31లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని ఆలయ బోర్డు తెలిపింది. 

మండలం విరక్కులో అయ్యప్ప(Ayyappa) దర్శనానికి వచ్చిన భక్తులతో శబరిమల ఆదాయం 200కోట్లు దాటిందని ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రావన్ కోర్ దేవస్వామ్ బోర్డు(Travancore Devaswom Board) వెల్లడించింది. గత 39రోజుల్లో 204.30కోట్ల రూపాయలు, భక్తుల ద్వారా 63.89కోట్ల రూపాయలు, ఆవరణ ప్రసాదం ద్వారా ఆలయానికి 96.32కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. విరాళాల రూపంలో వచ్చిన ఆదాయం పూర్తి కాలేదని ట్రావన్ కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. నాణేల లెక్కింపు తర్వాత ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చినట్లు తెలిపారు.

ALSO READ: BREAKING: భారత్ లో భారీ భూకంపం!

డిసెంబర్ 25వరకు జరగిన ఈ మండల విరక్కు పూజలో 39రోజుల్లో 31,43,163 మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్దు తెలిపింది. ఆదివారం 1.12లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ఇప్పటివరకు 7,25,049 మందికి ఫ్రీగా ఆహారం అందించారు. మండల పూజ తర్వాత బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తామని టీడీబీ తెలిపింది. ఆ తర్వాత డిసెంబర్ 30 న మకరవిళక్కు ఉత్సవం కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 15న మకరజ్యోతి పూర్తయ్యే వరకు అక్కడి నుంచి ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు.

ఇక శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీబీకి ఆదేశాలు జారీ చేసింది. భక్తుల తొక్కిసలాటను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీని ఆదేశించింది.

#sabarimala #telugu-latest-news #sabarimala-temple-is-closed-today #sabarimala-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe