అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..నవంబర్ 17 నుంచి తెరుచుకుంటున్న శబరిమల ఆలయం! శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు. By Bhavana 15 Nov 2023 in నేషనల్ New Update షేర్ చేయండి కేరళలోని శబరిమల క్షేత్రం నవంబర్ 17 నుంచి తెరుచుకోనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 17 వ తేదీ నుంచి మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా...రెండు నెలల పాటు స్వామి వారి మహాదర్శనం కొనసాగనుంది. దీనికి సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి అనేక ఏర్పాట్ఉల చేశామని ఆయన వివరించారు. అయ్యప్ప భక్తులు స్వామి వారి సన్నిధానానికి భారీగా వస్తుంటారు. దానిని దృష్టిలో పెట్టుకుని డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు. అంతేకాకుండా నిలాక్కళ్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్లు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పంబా వద్ద నుంచి సన్నిధానానికి వచ్చే మార్గంలో 15 చోట్ల అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. శబరిమల యాత్ర ఏర్పాట్లకు సంబంధించి సీఎంతో పాటు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు. శబరిమలను మండల మకరవిళక్కు పండగ సీజన్ లో ఏటా లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు దర్శించుకుంటారు. మలయాళ నెల వృశ్చికం తొలిరోజున మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం అవుతాయి..జనవరిలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తరువాత స్వామి వారి ఆలయాన్ని మూసివేస్తారు. శబరిమల , పంబాలో పారిశుద్ద్య పనుల్లో నిమగ్నమైన '' విశుద్ది సేన'' సభ్యుల రోజువారీ వేతనం రూ. 450 నుంచి రూ. 550 కి పెంచినట్లు అధికారులు తెలిపారు. వారి ప్రయాణ ఖర్చులను కూడా రూ. 850 నుంచి రూ.1000 కి పెంచుతున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం '' ఈ - కానిక్క '' సదుపాయాన్ని మరింత సమగ్రంగా రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సమగ్ర అధ్యయనాల అనంతరం నిత్యావసర వస్తువుల ధరల జాబితాను విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసిన జాబితాను ఐదు భాషల్లో ప్రచురించారు. వీటిని యాత్రికులకు స్ప జిల్లా కలెక్టర్ సమగ్ర అధ్యయనాల అనంతరం నిత్యావసర వస్తువుల స్థిర ధరల జాబితాను విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసిన జాబితాను ఐదు భాషల్లో ప్రచురించారు. వీటిని యాత్రికులకు స్పష్టంగా ప్రదర్శించి, అధిక ఛార్జీలు వసూలు చేయకుండా అధికారులు చూస్తారని ఆలయాధికారులు తెలిపారు. Also read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. ఆయన కారును ఢీకొట్టిన లారీ! #temple #sabarimala #ayyappa-deevotees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి