Sabarimala: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్‌ ఫైర్‌..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..!

భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Sabarimala: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్‌ ఫైర్‌..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..!
New Update

శబరిమల(Sabarimala) కి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు బీజేపీ (Bjp) అధ్యక్షుడు అన్నామలై (Annamalai)మరోసారి కేరళ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తమిళనాడు  (Tamilanadu)  ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు.

భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..అయితే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది వచ్చారని వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

'' ఈ ఏడాది స్వాములు ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులు గతంలో ఎప్పుడూ కూడా ఎదుర్కొలేదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి స్వామి అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం శబరిమలను సందర్శిస్తుంటారు, కానీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొలేదు. కమ్యూనిస్ట్‌ కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా సంసిద్ధంగా లేదు. కమ్యూనిస్ట్ కేరళ ప్రభుత్వం నిద్రపోతున్నందున భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించకుడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. భక్తులను ఆహారం లేదా నీరు లేకుండా గంటల తరబడి క్యూలలో నిలబడేలా చేసింది" అని అన్నామలై తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

''కమ్యూనిస్ట్‌ కేరళ ప్రభుత్వం తక్షణమే భక్తులకు ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి, భక్తులు ఎటువంటి కష్టాలు పడకుండా చూడాలని ఆయన కోరారు. దీనకిఇ స్టాలిన్‌ అధికారిక హ్యాండిల్‌ ట్యాగ్‌ చేస్తూ అన్నామలై ఇలా రాసుకొచ్చారు.'' మేము తమిళనాడు ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే..రద్దీలో చిక్కుకుపోయిన చాలా మంది భక్తులు తమిళనాడుకి చెందినవారు అని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ కూడా తన ఎక్స్‌ ఖాతాకు వెళ్లి..యాత్రికుల పరిస్థితి గురించి వివరించారు. '' అధికారులు ఇప్పటికైనా నిద్రావస్థ నుంచి మేల్కొని భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. కనీసం మంచినీరు, టాయిలెట్‌ అవసరాలు కూడా కల్పించలేని దౌర్భగ్య స్థితిలో కేరళ ప్రభుత్వం ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారులతో సహా పెద్ద స్వాములు కూడా సుమారు 12 గంటలకు పైగా రోడ్ల మీదే నీరు , ఆహారం లేకుండా ఇరుక్కుపోయారని పలు మీడియాలు ప్రచురించాయి.వాటిని పరగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అనిల్‌ కె నరేంద్రన్‌ జి గిరీష్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేక సిట్టింగ్‌ను నిర్వహించింది.

యాత్రికులకు స్వల్పకాలిక విశ్రాంతి స్థలాలైన 'ఎడతావలం'లలో నీరు, స్నాక్స్ మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి)ని బెంచ్ ఆదేశించింది.

Also read: 200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే!

#kerala #tamilanadu #annamaiah #sabarimalai #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి