Telangana : తెలంగాణ విద్యార్థులకు షాక్‌.. ఆ పరీక్షలు వాయిదా

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే.. ఎస్‌ఏ-2 పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్‌ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Telangana: పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు అలెర్ట్..
New Update

Shock To Telangana Students : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏటా నిర్వహించే.. ఎస్‌ఏ-2 పరీక్ష(SA-2 Exam) లకు సంబంధించి తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఏప్రిల్‌ 15వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటన చేశారు. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్‌ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 23వ తేదీన ఫలితాలు ప్రకటించి.. పేరంట్స్‌ మీటింగ్(Parents Meeting) నిర్వహస్తారు. ఆ తర్వాత పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

Also Read : కవితకు మరో షాక్

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు.. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 8వ తరగతికి ఉదయం 9 గంటల నుంచి 11:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 9 నుంచి 12:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఏ-2 పరీక్షల వాయిదా పడిన నేపథ్యంలో.. డీఈవోలు, సూళ్ల ప్రిన్సిపల్స్, విద్యార్థులు గమనించాలని అధికారుల సూచనలు చేశారు.

Also Read : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?

#telugu-news #telangana-news #sa-2-exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe