khammam: రామయ్య దర్శనం కాకుండానే.. బహిరంగ సభకు అమిత్‌షా

సమయం తక్కువ ఉండటం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్‌ ఖరారైంది. కానీ చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అయిందని బీజేపీ యంత్రాంగం ప్రకటించింది.

khammam: రామయ్య దర్శనం కాకుండానే.. బహిరంగ సభకు అమిత్‌షా
New Update

కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ఫోకస్ పెట్టేశాయి. గ్యాపు లేకుండా వరుస పెట్టి మరి అక్కడ బహిరంగ సభలు పెడుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్‌లో ఖమ్మం నేతల్లో అసంతృప్తి నెలకొన్నా.. మరోవైపు బీజేపీ.. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం జిల్లాకు రానున్నారు. అగ్రనేతలు తెలంగాణకు రాకతో మళ్లీ బీజేపీలో జోరు పెంచుతోందని ప్రజలు అనుకుంటున్నారు.

లక్షమందితో సభ 

ఖమ్మం జిల్లాలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతు గోసా.. బీజేపీ భరోసా పేరిట సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఈ సభలో రైతు డిక్లరేషన్‌ను అమిత్‌ షా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ బీజేపీ అధికారులు. సభకు సుమారు లక్షమంది వరకు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెయ్యి బస్సులతో జనసమీకరణ ఏర్పాటు చేశారు అధికారులు.

రైతుల సమస్యలపై ప్రస్తావన

ఖమ్మం జిల్లా పట్టణంలో రైతు గోస.. బీజేపీ భరోసా సభను నిర్వహిస్తున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, డికే అరుణ తదితరులు పాల్గొంటారు. అమిత్‌ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి .. మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకోని..సభలో ప్రసంగించనున్నారు. ఈ రైతు గోస-బీజేపీ భరోసా సభలో అమిత్‌ షా రైతుల సమస్యలను ప్రస్తావించడంతో పాటు పరిష్కారానికి బీజేపీ ఏం చేయనుందనే అంశాన్ని వెల్లడిస్తారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఈ సభను ఏర్పాటు చేశారు.

మూడోసారి కూడా రద్దు

గతంలో కూడా రెండు సార్లు అమిత్‌షా ఖమ్మం పర్యటన రద్దైన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొంత నిరాశకు గురైయ్యారు. ఇక మూడోసారి పర్యటన ఖరారైన తర్వత కూడా భద్రాచలం పర్యటన రద్దు కావడటంపై తెలంగాణ బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ మధ్య వరద వల్ల గోదావరి ముంపుకు గురైన విషయం తెలిసిందే. అమిత్‌ షా భద్రాచలం పర్యటన రద్దుతో రాజకీయ విశ్లేషకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

#khammam #amit-shah #public-meeting #rythu-gosa-bjp-bharosa-sabha #ramaiah-darshan-cancellation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe