రైతుబంధు ఆగిపోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే రైతుబంధును కాంగ్రెస్ అడ్డుకుందనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసాగా రూ.15 వేలు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. By srinivas 27 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Reddy on Rythu Bandhu: రైతుబంధు పంపిణీని ఎలక్షన్ కమిషన్ నిరాకరించడంపై రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతుబంధుకు ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుందని మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, పదిరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల ఖాతాల్లో పైసలు వెస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk — Revanth Reddy (@revanth_anumula) November 27, 2023 Revanth Reddy:'రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్పా.. నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ (Congress) రాగానే రూ.15 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం' అంటూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా రెండు పార్టీల అభిమానులు తీవ్రంగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ నెట్టింట చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. Also read :Rythu Bandhu: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్.. ఇక రైతుబంధు (Rythu Bandhu) ఇష్యూపై మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకుందని అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు వెంబటబడి రైతు బంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బంధు ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదని చెప్పారు. ఇప్పటికే రూ.72 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రైతులంతా బీఆర్‌ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిందన్నారు. అన్నదాతలంతా ఓటు ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. #revanth-reddy #harish-rao #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి