రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు (Russian President Vladimir Putin) గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 9:05 గంటల సమయంలో ఆయన గుండె పోటుకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు టెలిగ్రామ్ ఛానెల్ ‘జనరల్ ఎస్‌విఆర్’ను ఉటంకిస్తూ ఈ మీడియా నివేదికలు వస్తున్నాయి. గుండె పోటు రావడంతో ఆయన బెడ్ రూంలో కింద పడిపోయినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన టేబుల్ పై ఉన్న ఆహార పదార్థాలను తన్ని వేసినట్లు తెలుస్తోంది. దీంతో అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దగా శబ్ధం రావడంతో సిబ్బంది వచ్చి చూడగా ఆయన మెలికలు తిరిగిపోతూ కింద పడి కనిపించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..
బెడ్రూం తలుపులు పగులగొట్టి మరీ లోపలికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రష్యా అధికారిక వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయమై స్పందించలేదు. నిన్న సాయంత్రం నుంచి వార్తా కథనాలు వస్తున్నా కూడా.. అధికార వర్గాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిజమేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో పుతిన్ కు చికిత్స అందుతోందని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. పుతిన్ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వ్యాయామం అధికంగా చేస్తూ.. చాలా ఫిట్ గా కనిపిస్తుంటారు.
ఇది కూడా చదవండి: Israel:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు
గతంలోనూ పుతిన ఆరోగ్యంపై అనేక ప్రచారాలు జరిగాయి. ఆయనకు పార్కిన్సన్ వ్యాధి సోకిందని.. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చికిత్స సైతం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ గుండెపోటుపై అధికారికంగా ప్రచారం వచ్చే అవరకు ఉత్కంఠ ఇలానే కొనసాగుంది.