Russia-Ukraine War: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఖైదీలు మృతి రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. By B Aravind 24 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ ఖైదీలను తీసుకెళ్తోంది. ఈ క్రమంలోని ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ యుద్ధ విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలున్నారని.. వారితో పాటు ఆరుగురు విమాన సిబ్బంది.. మరో ముగ్గురు ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆ యుద్ధ విమానం గాల్లో నుంచి కిందపడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధ ఖైదీలను మార్చుకునే ఒప్పందంలో భాగంగా రష్యా తమ యుద్ధ విమానంలో 65 మంది ఖైదీలను తీసుకెళ్లింది. కానీ రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోర్డ్ అనే ప్రాంతంలో ఇలా ఊహించని ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. #BREAKING: A Russian military plane carrying 74 people has crashed in the #Belgorod region, #Russia's Defense Ministry said, according to Russia's RAI Novosti news agency. pic.twitter.com/40dTcBHTXF — Geo View (@theGeoView) January 24, 2024 #russia-ukraine-war #russai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి