Russia-Ukraine : రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై.. రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది. డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 26 Aug 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Russia-Ukraine War : రష్యా , ఉక్రెయిన్ (Ukraine) దాడుల నేపథ్యంలో సోమవారం రష్యా (Russia) లోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. ఓ ఎగిరే డ్రోన్ నేరుగా భవనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ ఉంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రష్యాలోని సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కై లో జరిగింది. ఎత్తైన భవనాన్ని డ్రోన్ ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారాయి. వీడియో ప్రకారం.. డ్రోన్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. అది నేరుగా 38 అంతస్తుల ఎత్తైన భవనంను ఢీకొట్టింది. దీంతో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. డ్రోన్ దాడి కారణంగా భవనంలోని కిటికీల అద్దాలు పగలడంతో కింద పార్కింగ్ చేసిన 20కిపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. BREAKING: Watch the moment a drone crashes into the 38-story Volga Sky residential complex, the tallest building in the city 📌#Saratov | #Russia#Ukraine #Russia #drone #droneattack 🎥 : MASH pic.twitter.com/op17BFrqc0 — DISASTER TRACKER (@DisasterTrackHQ) August 26, 2024 రష్యాలోని సరతోవ్ ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాల్లో ఉక్రెయిన్ సోమవారం అనేక డ్రోన్ దాడులు చేసిందని మాస్కోలోని ఆగ్నేయ ప్రాంత గవర్నర్ రోమన్ బసుర్గిన్ తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. ఓ ఇల్లు ధ్వంసమైందని అధికారులు తెలిపారు. రష్యా వాయు రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్ డ్రోన్ ను కూల్చేశాయి. దీని శిథిలాలు సరతోవ్ నగరంలోని నివాస సముదాయాన్ని ఢీకొనడంతో భవనం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. నగరం పరిధిలో, ఎంగెల్స్‌లోని ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర సేవలు అందించినట్లు గవర్నర్ వివరించారు. Engels and Saratov were reportedly attacked by drones this morning. So far, reports indicate damaged buildings and at least 20 vehicles. One of the drones crashed into the tallest high-rise building in Saratov, falling about 12 kilometers short of the Engels military airfield. pic.twitter.com/cjsmedAqf3 — NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) August 26, 2024 ఈ డ్రోన్ దాడి అచ్చం 9/11 అమెరికాలో పెంటగాన్ సిటీని విమానం ఢీకొట్టిన ఘటనలానే అనిపిస్తుంది. అయితే అక్కడ విమానం, ఇక్కడ డ్రోన్ అంతే తేడా. Also Read: నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు! #drone-attack #russia-ukraine-war #volga-sky మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి