Vishaka: విశాఖలో మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మించిన రుషికొండ కోట భవనాల 'సీక్రెట్స్ అన్నీ బయటపడుతున్నాయి. మూడున్నరేళ్లుగా సామాన్య ప్రజలకు తెలియకుండా దాచివుంచిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాయి. మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో ఏడు బ్లాక్‌లుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో రూ.కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నీచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. ఇంకా ఈ రుషికొండపై నిర్మించిన భవనాల్లో ఏముందో RTV స్పష్టంగా చూపించింది.
ఈ మేరకు 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా భవనాల నిర్మాణం చేపట్టారు. ఏడు బ్లాకులకు వేంగి-A, వేంగి-B, కళింగ, గజపతి, విజయనగరం A,B,C బ్లాకులుగా పేర్లు పెట్టారు. ఈ భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కళింగ బ్లాకులో 400 మంది కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్, 100 మందికి సరిపడేలా మరో నాలుగు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. చూడగానే కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఉన్న ఖరీదైన ఫర్నీచర్ ఉంది.
ఖరీదైన షాండ్లియర్లు, 500 చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూంలు. బాత్రుంలోని ఒక కమోడ్ ధర రూ.12 లక్షలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక విదేశాల నుంచి ప్రత్యేకమైన బెడ్స్. బాత్రుంలలో గోల్డ్ కలర్ షవర్లు, కుళాయిలు, టీవీలు. వినూత్నమైన డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు, హాళ్లలో బిగ్ స్క్రీన్లు. ఖరీదైన కుర్చీలు, డిజైన్డ్ గ్లాస్ డోర్లు, ఆటోమెటిక్ కర్టెన్లతో విలాసవంతమైన పడక గదులున్నాయి. భవనాల మధ్య కళ్లు తిప్పుకోలేని ల్యాండ్ స్కేపింగ్ కూడా నిర్మించారు.