AP: కోటంరెడ్డికి కోపం వచ్చింది.. ఆ పనులు చేయాలంటూ ఆగ్రహం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం కింద ఎంపి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని రూరల్ ఎమ్మెల్యే వెల్లడించారు.

AP: కోటంరెడ్డికి కోపం వచ్చింది.. ఆ పనులు చేయాలంటూ ఆగ్రహం
New Update

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వైకుంఠం నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు తొలిపాదం మోపిన ప్రాంతం వేదగిరి అన్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కొనేర్లు, గిరిప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వద్ద అభివృద్ధి చేసేలా ఆడిగాం. నా ప్రయత్నంలో నాకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ, దీపా వెంకట్, డిఫెన్స్ అడ్వైజర్ సతీష్‌రెడ్డి, అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు ఎంతగానో సహకరించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేశారు. గణేష్ ఘాట్, ఎన్టీఆర్, నెక్లెస్‌రోడ్డు, ఇరుకళల పరమేశ్వరి ఆలయం, భారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీం కింద 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నామని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

అనుమతులు ఇవ్వాలని డిమాండ్

నరసింహకొండకి వెళ్లే దారిలో పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జిని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానికి కోటంరెడ్డి డిమాండ్‌ చేశారు. స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్, ఎన్టీఆర్, నెక్లెస్ రోడ్డు కోసం 6 కోట్లతో అభివృద్ధి పనులను టెండర్లు పూర్తి అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదన్నారు. కాంట్రాక్టర్‌కి త్వరగా సాంకేతికంగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నుడా అధికారులు లేక కూడా రాశాము.. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. భారా షాహిద్ దర్గాలో కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు ఆపేసి ఉన్నారు. ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కితబుపలికారు.

పారిశ్రామిక వాడను అడ్డుకుంటున్నారు

అలానే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్‌కి రూ.5 కోట్లు, ముస్లిం షాదీ మంజిల్‌కి మరో రూ.5 కోట్లు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ముస్లిం, దళితులు, గిరిజనుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలో 95 శాతం పనులు పూర్తయ్యాయి. 5 శాతం పనులు ఈ ప్రభుత్వ హయాంలో పూర్తికాలేదన్నారు. పిల్లలు ఆటోనగర్‌లో పొల్యూషన్ మధ్య చదువుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. ఆమంచర్ల సెజ్ కోసం 500 ఎకరాల పారిశ్రామిక వాడ కట్టాలని టీడీపీ హయాంలో 52 కోట్ల రూపాయలు రైతులకు పరిహారం కూడా ఇచ్చారు. 10 వేల మందికి ఉపాధి వచ్చే ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సాంకేతికంగా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆయన సంతాప సభలో ఈ విషయాన్ని సీఎం ఎదుట చెప్పా... కానీ ఇప్పటివరకు పని కాలేదని రూరల్ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, క్లస్టర్ ఇన్‌ఛార్జులు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, టీడీపీ నాయకులు హజరత్ నాయుడు, నూకరాజు మదన్ కుమార్‌రెడ్డి, దినేష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నెరవేరిన గిరిజనుల పదేళ్ల కల..ఎట్టకేలకు మోక్షం

#press-conference #rural-mla-kotamreddy-sridhar-reddy #nellore-rural #mla-office
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe