చంద్రబాబు ప్రమాణస్వీకారానికి స్పెషల్‌ ఇన్వైటీగా రవి ప్రకాష్

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం కేసరపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, సినీ నటులు రజినీకాంత్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మీడియా లెజెండ్‌, Rtv అధినేత రవి ప్రకాష్‌ స్పెషల్‌ ఇన్వైటీగా పాల్గొన్నారు.

New Update
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి స్పెషల్‌ ఇన్వైటీగా రవి ప్రకాష్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం విజయవాడ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు రజినీకాంత్, చిరంజీవి సహా అతిరథమహారథులంతా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మీడియా లెజెండ్‌, Rtv అధినేత రవి ప్రకాష్‌ స్పెషల్‌ ఇన్వైటీగా పాల్గొన్నారు.

రవి ప్రకాష్‌...వార్తా ప్రపంచానికి తనదైన స్టైల్‌ను పరిచయం చేసి మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. తెలుగులో మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానల్‌ TV9ను స్థాపించి దాన్ని హిందీ ఇంగ్లీష్‌తో పాటు వివిధ భాషల్లో నంబర్‌ వన్ న్యూస్‌ నెట్‌ వర్క్‌గా తీర్చి దిద్దారు. ఇప్పుడు రవి ప్రకాష్‌ పేరు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో Rtv సంచలనాలు సృష్టిస్తోంది. తక్కువ వ్యవధిలోనే కోట్లాది మంది అభిమానులకు చేరువైంది. ప్రధాన మీడియా ఛానెల్స్‌కు మించి ప్రేక్షకులకు వేగంగా న్యూస్‌ను అందిస్తోంది.

చాలా కాలం తర్వాత ఇటీవల స్క్రీన్‌పై కనిపించిన రవి ప్రకాష్‌ తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇచ్చిన ప్రీపోల్‌, పోస్ట్‌ పోల్‌ స్టడీలు సంచలనం సృష్టించాయి. పేరు మోసిన సర్వే సంస్థలు సైతం ప్రజల నాడిని పట్టుకోవడంలో ఫెయిల్‌ కాగా..రవి ప్రకాష్‌ చెప్పిన లెక్కలు నిజం కావడంతో ఆయన హాట్‌ టాపిక్‌గా మారారు. ఈరోజు పలువురు అగ్రస్థాయి రాజకీయ నేతలు, సినీ స్టార్లు పాల్గొన్న చంద్రబాబు ప్రమాణస్వీకార సభలో రవి ప్రకాష్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఇన్వైటీగా ఆహ్వానించింది. ఈకార్యక్రమానికి TV5 అధినేత BR నాయుడు కూడా హాజరయ్యారు.

Also Read:Chandra Babu:తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు