ROUND UP: మెదక్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎవరికి?

మెదక్ నియోజకవర్గంలో రాజకీయ నేతల ప్రచారాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్తిగా పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ కుమార్ ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడనున్నారు.

New Update
ROUND UP: మెదక్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎవరికి?

Medak Politics: మెదక్ లో రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడి అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునేలా కార్యాచరణ చేపట్టారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంత రావు తనయుడు రోహిత్ రావు, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అయితే, ఈ ముగ్గురు నేతల్లో ప్రజలకు ఎవరికీ పట్టం కడుతారో డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాలి. ముందుగా ఈ ముగ్గురు అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ గురించి ఓ లుక్ వెయ్యండి.

ALSO READ: ఈ 7 మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..!

బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి:

* పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.
* తెలంగాణ ఉద్యమం పీక్ లో  ఉన్న సమయంలో రామాయంపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.
* 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
* రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు:

* గతంలో రామాయంపేట నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా సేవలందించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తన కొడుకు మైనంపల్లి రోహిత్ రావుకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ కొరకు బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని కోరారు. అధిష్టానం టికెట్ కేటాయించక పోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కొడుకును బరిలోకి దించారు.
* రోహిత్ రావు తన రాజకీయ భవిషత్ ను తొలిసారిగా మెదక్ నుంచి ప్రారంభించనున్నారు.
* మెదక్ నుంచి ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నారు.
* వైద్య వృత్తితో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు.
* కరోనా సమయంలో ఉచితంగా మందులు, సరుకులు ఇంటింటికి పంపించారు.
* రాజకీయ అనుభవం లేకున్నా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ALSO READ: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా?

బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్:

* ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పంజా విజయ్ కుమార్.
* అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు.
* 2019లో బీఆర్ఎస్ లో చేరి జడ్పీటీసీ సభ్యుడు అయ్యారు.
* హిందూ సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇస్టమ్ ఉండటం.
* గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం కోసం సాయం చేయడం.
* హిందూ ఎజెండాతోనే ప్రజల ముందుకు వెళ్లనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు