Andhra Pradesh : ఏపీ ఎన్నికల ఫలితాలను ఎగ్జాక్ట్‌గా అంచనా వేసిన RTV

ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని ఎన్నికలకు ముందే అందరికన్నా ముందుగా చెప్పిన RTV సంచలనం సృష్టించింది. చివరికి RTV స్టడీలో చెప్పిందే నిజమైంది. మిగతా సర్వే సంస్థల కన్నా RTV కచ్చితమైన అసెంబ్లీ, ఎంపీ సీట్ల వివరాలు వెల్లడించింది.

New Update
Andhra Pradesh : ఏపీ ఎన్నికల ఫలితాలను ఎగ్జాక్ట్‌గా అంచనా వేసిన RTV

AP Elections Results : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు.. రాష్ట్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని జనాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరూ కూడా అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల స్టడీతో వచ్చింది RTV. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారో చెప్పబోతున్నానంటూ 'రవిప్రకాష్‌' స్డడీ లెక్కలు చెప్పడం ప్రారంభగానే.. కొద్ది నిమిషాల్లోనే లక్షలాది మంది ప్రేక్షకులు RTVకి అతుక్కుపోయారు. చివరికి ఏపీలో వైసీపీ ఓడిపోతుందని.. టీడీపీ-జససేన-బీజేపీ కూటమి గెలవబోతుందని రవిప్రకాష్ తేల్చిచెప్పారు. అందరికన్నా ముందుగా.. ఏపీలో కూటమి గెలవబోతుందని చెప్పి సంచలనం సృష్టించింది RTV.

Also Read: 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?

మే 13న ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ వివరాలు వెల్లడించింది. ఇందులో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) కి 150కి పైగా స్థానాల్లో గెలవనుందని.. వైసీపీ 23 కంటే తక్కువ స్థానాలతో సరిపెట్టుకోనుందని చెప్పింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక వచ్చాక చివరికి RTV చెప్పిందే ముమ్మాటికి నిజమయ్యింది. కొన్ని బడా సర్వే సంస్థలు కూడా RTV అంచనా వేసినట్లుగా కచ్చితమైన సీట్ల వివరాలు అందించలేకపోయాయి. మరికొన్ని అగ్రమీడియా సంస్థలు కూడా ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ను చూపించాయి. ఇండియా టుడే - మై యాక్సిస్‌ ఇండియా, పీపుల్స్‌ పల్స్, చాణక్య లాంటి సంస్థలు కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ కచ్చితమైన అసెంబ్లీ స్థానాల సంఖ్యను చెప్పలేకపోయాయి. ఇక ఆరా మస్తాన్‌తో సహా మరికొన్ని సర్వే సంస్థలు అయితే ఏపీలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక చివరికి వాళ్ల లెక్కలన్ని తారుమారయ్యాయి.

మొత్తంగా చూస్తే అన్ని సర్వే సంస్థల కన్నా RTV స్టడీలో కచ్చితమైన ఎన్నికల ఫలితాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ కోసం.. RTV సంస్థ క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించింది. అలాగే పలువురు రాజకీయ నిపుణుల చెప్పిన వివరాల నుంచి, రవి ప్రకాశ్ అనుభవం నుంచి మొత్తంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే వివరాలను వెల్లడించింది RTV. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసిన అందికన్నా ముందుగా RTV చెప్పిన స్డడీయే నిజమైందనే ప్రశంసలు వస్తున్నాయి. RTV అంటేనే మీ నమ్మకం మా బాధ్యత, ఎప్పుడు మీ కోసమే, మీ వెంటే..

Also Read: టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే!

Advertisment
తాజా కథనాలు