విశాఖపట్నంలో నిన్న జరిగిన ఆటో ప్రమాదంలో 8 మంది చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీవో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఏకకాలంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిన్న ఒక్క రోజే 28 ఆటోలను సీజ్ చేసిన అధికారులు. ఈరోజు ఎన్‌ఏడీ ప్రాంతంలో 16 కేసులు నమోదు చేసిన అధికారులు.
మద్దిలపాలెం, ఎన్‌ఏడీ, గాజువాక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు. కాగితాలు సరిగా లేని 5 ఆటోలను సీజ్ చేసిన ఆర్టీవో ఆఫీసర్స్. ఇక నుంచి ఆటోల్లో కేవలం 6 గురు విద్యార్థులను మాత్రమే తీసుకుని వెళ్లాలని అధికారుల ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆటోలో 6 గురు మించి ఒక్కరు ఎక్కువగా ఉన్నా సరే రూ. 1000 చలానా విధిస్తామని తెలిపారు.
10 మందికి మించి ఉంటే కనుక ఆటోను సీజ్ చేసి డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు. బుధవారం ఉదయం విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ(Vizag)లోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తపు మడుగులో విలవిల్లాడిన చిన్నారులను చూసిన స్థానికులు తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కి కాల్ చేసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆటో ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు!