Crime: ఆర్టీసీ బస్సు ఢీ.. ప్రభుత్వ ఉద్యోగి మృతి! ఆర్టీసీ బస్సు ఢీ కొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్న సింగరి నరేష్ బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నకిరేకల్ వద్ద బస్సు టైర్ల కిందపడి మరణించాడు. ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన జనాలకు కలచివేసింది. విధులు ముగించుకుని బైక్ పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు అదే బస్సు టైర్ల కింద పడి మరణించాడు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా అతన్ని నకిరేకల్ పట్టణానికి చెందిన సింగరి నరేష్ (34) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బస్సును ఓవర్ టెక్ చేయబోయి.. నకిరేకల్ పట్టణానికి చెందిన సింగరి నరేష్ కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట మండలంలోని ఇనుపాముల నుంచి నకిరేకల్ వెళ్లే సర్వీస్ రోడ్డుపై బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సింగరి నరేష్ గత ఏడాదిగా కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కార్యాలయంలో విధులు ముగించుకుని మోటార్ సైకిల్ పై నకిరేకల్ వెళుతూ ఇనుపాముల శివారులోని జంక్షన్ వద్ద సూర్యాపేట నుంచి నల్లగొండ వెళ్తున్న సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కుడి వైపున ఓవర్ టేక్ చేస్తున్నాడు. ఇది కూడా చదవండి: Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే! ఈ క్రమంలోనే బస్సును ఓవర్ టేక్ చేస్తున్న మోటార్ సైకిల్ ను గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును అనుకోకుండా కుడివైపుకు తిప్పాడు. దీంతో బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో నరేష్ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చనిపోయాడు. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై శివతేజ గౌడ్ తెలిపారు. #rtc-bus-accident #nakirekal #govt-employees-death మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి