BJP President : బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చినా..ఆర్ఎస్ఎస్ ఈ పదవి కోసం రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ను రికమండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

New Update
BJP President : బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే?

Rajasthan Ex CM Vasundhara Raje :  బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా (JP Nadda) ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నడ్డా స్థానంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే, పలువురి పేర్లు ఈ స్థానం కోసం ప్రచారంలో ఉన్నాయి. ఒక దశలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు కూడా వినిపించింది. కానీ, ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బీజీపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. 

BJP President : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు కావడంతో బీజేపీ అధ్యక్ష పదవికి ధీటైన వ్యక్తిని తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షా బాధ్యతలు సీనియర్ న్నాయకురాలు వసుంధర రాజేకు అప్పచెప్పాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా రికమండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే త్వరలోనే వసుంధర రాజే పేరు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఖాయం చేయవచ్చు. 

రెండుసార్లు సీఎం.. 

వసుంధర రాజే (Vasundhara Raje) రాజస్థాన్ (Rajasthan) కు రెండు సార్లు సీఎంగా పనిచేశారు. 2003లో తొలిసారి ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజస్థాన్ కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు. తరువాత 2013 నుంచి 2018 వరకూ రెండోసారి ముఖ్యమంత్రిగా వసుంధర రాజే వ్యవహరించారు. 1984లో రాజకీయ ఆరంగేట్రం చేసిన వసుంధర రాజే ధోల్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సంవత్సరం ఆమెను బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆమె లోక్ సభకు కూడా చాలాసార్లు ఎంపికయ్యారు. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ బీజీపీలో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం వసుంధర రాజేకు ఉంది. ఈ కారణంగానే ఆర్ఎస్ఎస్ ఆమెను జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని ఆర్ఎస్ఎస్ బలంగా చెబుతోందని అంటున్నారు.

Also Read : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ!

Advertisment
తాజా కథనాలు