RSP : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ను ఈడీ అనవసరంగా వేధిస్తోందని మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో కవితను బాల్క సుమన్ తో కలిసి ములాఖత్ అయిన ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని, కవిత నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని తెలిపారు. అలాగే లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా కవితను సీబీఐ అరెస్టు చేయడం దారుణమని, రాత్రికి రాత్రి జడ్జిని ఎలా మారుస్తారంటూ విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..Tihar Jail : కవిత నిర్దోషి.. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : ఆర్ఎస్పీ ఆగ్రహం!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తిహార్ జైల్లో ములాఖత్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. కవిత దగ్గర రూపాయి దొరకకపోయినా ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. వాళ్ల పేర్లు, వీళ్లా పేర్లు చెప్పాలంటూ ఈడీ అధికారులు కవితను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: