LPG Cylinder : రూ. 500కే సిలిండర్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే ఎలా? సొంతూరుకెళ్లి అప్లయ్ చేసుకోవల్సిందేనా?

తెలంగాణ సర్కార్ 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో రూ. 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. తక్కువ ధరకే సిలిండర్ తీసుకోవాలంటే హైదరాబాద్ లో ఉంటున్నవారు దరఖాస్తు కోసం సొంతూరు కు వెళ్లాల్సిందేనా?అయితే ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!
New Update

New Gas Connection : తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ(Telangana Govt 6 Guarantee)ల అమలుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలన పేరుతో ఎన్నికల హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో రూ. 500కే గ్యాస్ సిలిండర్(LPG Cylinder)కూడా ఉంది. అన్నింటికీ ఒకే అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎల్పీజీ సిలిండర్ తక్కువ ధరకే పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. ఇంకా గ్యాస్ బాండ్ అవసరం. గ్యాస్ సిలిండర్ (LPG Cylinder) పాస్ బుక్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వారికే ఈ స్కీం కింద ప్రయోజనం పొందుతారు. అయితే రూ. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండ్ తీసుకోవాలంటే వాళ్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజెన్సీ పేరు, ఏడాదికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య వంటి వివరాలను ప్రజాపాలన అప్లికేషన్స్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.

ఇలా ప్రజాపాలన దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్ తోపాటు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కూడా జత చేయాలి. అప్లికేషన్స్ గ్రామసభలో అధికారికి అందించాలి. వాళ్లు అడిగిన వివరాలను ఇస్తే..వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది వారు నిర్ణయిస్తారు. అలా ప్రజా పాలన దరఖాస్తు చివర్లో రసీదు కూడా ఉంటుంది. దీన్ని నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్రేసి ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. భవిష్యత్తులో అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో ఈ అంశంపై ఎన్నో అనుమానాలు రేకేత్తుతున్నాయి.

అభయహస్తం గ్యారెంటీ పథకాల(Abhaya Hastam Guarantee Scheme) లబ్ధి పొందేందుకు ప్రజా పాలన దరఖాస్తును నింపే క్రమంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రూ. 500కే గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే మగవారి పేరుతో ఉన్న కనెక్షన్ ను ఆడవాళ్ల పేరు మీదకు మార్చుకోవాలా? ఇలాంటి సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మరో డౌట్ కూడా ఉంది. తక్కువ ధరకే సిలిండర్ తీసుకోవాలంటే హైదరాబాద్ ఉన్నవారు కూడా దరఖాస్తు కోసం సొంత ఊరుకు వెళ్లాల్సిందేనా. ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

#telangana-govt-scheme #abhayahastam-guarantee-scheme #lpg-cylinder
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి