/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T133637.680-jpg.webp)
MRO Ramanaiah : తహశీల్దార్ రమణయ్య హత్య(MRO Ramanaiah Murder) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపిన విషయం తెలిసిందే. కాగా బాధితుడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాదు రమణయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం(Job) ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంట్లోకి చొరబడి దాడి..
ఈ మేరకు విశాఖ జిల్లా(Visakha District) కొమ్మాదిలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఆతని ఇంట్లోకి చొరబడిన దుండగులు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అయితే ఈ కేసులో మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మణం గంగారావు చీకటి జీవితంలోని అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రూ.2.50 కోట్ల మేర మోసం చేసినట్లు హైదరాబాద్, విజయవాడ పరిధిలో నమోదైన రెండు కేసులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు.
విలన్ పాత్ర పోషించి..
సినిమా ఫీల్డ్(Cinema Field) పై ఇష్టంతో మూడేళ్ల క్రితం ‘ది నైట్’(The Night) అనే రెండు ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ తీసిన మురారీ.. రూ.40 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు వెళ్లిపోయాడు. దాంతో తానే దర్శకత్వ బాధ్యతలు వహించిన మురారి.. విలన్ పాత్ర కూడా పోషించాడు. హింస ఎక్కువ ఉండటంతో ఓటీటీలో విడుదలకూ అభ్యంతరాలొచ్చాయి. హైదరాబాద్‌లో రూ.1.80 కోట్ల మోసానికి పాల్పడి, ది నైట్ సిరీస్‌ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ కేసులోంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : Yogi Kadsur: సైకిల్ గురు ఇకలేరు.. గుండెపోటు వార్తవిని ఖంగుతిన్న డాక్టర్లు
సిరీస్‌లో చేసినట్లే..
అయితే సిరీస్ ట్రైలర్‌లో మురారి ఓ యువతి తలపై కొడతాడు. అచ్చం అలాగే తహసీల్దారు రమణయ్యను ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. కాగా ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య ఆలస్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో తెరవెనక ఎవరు ఉన్నారనేది గోప్యంగా ఉంచుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితంగా ఉన్న ఓ నిర్మాణ సంస్థ యాజమాన్యం ద్వారా పావులు కదిపి.. తెరవెనుక అసలు కథను కనుమరుగు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిందితుడు మురారిపై హత్య కేసు నమోదు చేసి భీమిలి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ విధించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు.