Tamilanadu : తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత!

తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

New Update
Tamilanadu : తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత!

Drugs : తమిళనాడు(Tamilanadu) నుంచి శ్రీలంకకు(Srilanka)   అక్రమంగా తరలిస్తున్న రూ. 108 కోట్ల మాదకద్రవ్యాలను ఇండియన్ కోస్ట్‌ గార్డ్(Indian Coast Guards), DRI అధికారులు పట్టుకున్నారు. మండపం తీరంలో ఓ దేశీయ పడవ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 99 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి అధికారులు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబండించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

మార్చి 4 వ తేదీ రాత్రి కోస్ట్‌ గార్డ్‌ నౌక తో గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వద్ద సెర్చ్‌ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను అధికారులు చేపట్టారు. మంగళవారం నాడు కూడా గస్తీ కాస్తున్న అధికారులకు నిందితులు చిక్కారు. దీంతో వారిని అదుపులోనికి తీసుకుని విచారించేందుకు బోటు, బోటులోని నిషిద్ద వస్తువులతో పాటు తీరానికి తీసుకుని వచ్చారు.

వారిని గట్టిగా విచారించగా బోటులో ఉన్న బస్తాలలో మాదక ద్రవ్యాలు(Drugs) ఉన్నట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో అధికారులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీలంకలోని కొందరు వ్యక్తులకు చేరవేసేందుకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. అయితే వారి పేర్లు మాత్రం మాకు తెలియదంటూ నిందితులు వాపోతున్నారు.

ఈ క్రమంలోనే డీఆర్‌ఐ అధికారులు ఈ ఆపరేషన్ సూత్రధారిని అతని ఇంట్లోనే అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి భారత్‌(India) నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణంలో తేలింది. ప్రధాన నిందితునితో పాటు మరో నలుగురు నిందితులు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

Also read: సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు!

Advertisment
తాజా కథనాలు