Big News: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.!

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. వరి, నిమ్మ, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

New Update
Big News: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.!

Big News:  తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాలు వర్షాలు కురిసాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. కాంటకోసం కొనుగోళ్లు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు అక్కడి రైతన్నలు తీవ్రంగా పంట నష్టపోయారు. పలుచోట్ల వడగల్లవాన కురిసింది. ఇటు నల్లగొండ, పాలమూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నిమ్మ, బత్తాయి, మామిడి, ధానిమ్మ కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రూ. 15.81కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. లోకసభ ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లో జమ చేయన్నారు.

అయితే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా ఆధారంగా పంటనష్ట పరిహారం చెల్లిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు 15,246 మంది రైతులు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతోపాటు ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు. వీటితోపాటు రైతుభరోసా పథకం ద్వారా రూ. 15వేలు రైతుల అకౌంట్లో వానాకాలం సీజన్ నుంచి జమ కానుంది.

ఇది కూడా చదవండి: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ సత్తా చాటేనా?..ఇంతకు ఎవరీ శ్రీకళా రెడ్డి..!

Advertisment
తాజా కథనాలు