RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం మరో సారి సంచలనం సృష్టిస్తుంది. 2022 అక్టోబర్ 21న జపాన్ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. తాజాగా శతదినోత్సవం కూడా పూర్తి చేసుకుంది. దీంతో విదేశాల్లో వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది RRR.
Also Read: Kumari Aunty: సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వైరలవుతున్న ప్రోమో
ఒక్క నిమిషంలో హౌస్ ఫుల్!
అయితే ఈ సందర్భంగా జపాన్ ప్రేక్షకుల కోసం మార్చి 18న ఓ స్పెషల్ షో స్క్రీనింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు రాజమౌళి. ఈ విషయం తెలియడంతో.. జపాన్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షోకు సంబంధించి బుధవారం రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. కేవలం ఒక్క నిమిషంలోనే హౌజ్ ఫుల్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు RRR మూవీ మేకర్స్ . "జపాన్ థియేటర్స్ లో రిలీజై దాదాపు 1.5 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటికీ వరకు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మార్చి 18న ఒక నిమిషం లోపే హౌస్ ఫుల్ అయిపోయింది. ఇది సంపూర్ణ RRRAMPAGE అని పేర్కొన్నారు."
RRR సినిమాలో కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటన భారతీయ ప్రేక్షకులతో పాటు, అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం మైమరిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచమంతటా మారుమోగింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.