RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9వేల ఉద్యోగాలు

భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024లో భాగంగా 9వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చిలో మొదలై ఏప్రిల్ లో ముగియనుంది. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9వేల ఉద్యోగాలు

Technician Recruitment 2024: భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు 2024 టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 9వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

దరఖాస్తు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుంది. ఏప్రిల్ లో ముగుస్తుందని తెలిపారు. అయితే తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

పరీక్షలు :
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) అక్టోబర్, డిసెంబర్ 2024 మధ్య నిర్వహించబడతాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. ఫిబ్రవరి 2025లో తుది ఫలితాలు విడుదలచేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Big Scam: రూ.లక్ష కోట్లు కాజేసిన దేశాన్నే కుదిపేసి మహిళ..

అర్హత ప్రమాణాలు..
ఇక ప్రస్తుతం టెక్నీషియన్ల రిక్రూట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా మరొక కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ (CEN) విడుదలను ఖరారు చేసే ప్రక్రియను సిద్ధం చేసినట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్‌ను పూర్తి వివరాలతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఔత్సాహిక అభ్యర్థులు ఈ రాబోయే నోటిఫికేషన్‌కు సంబంధించి సకాలంలో అప్‌డేట్‌లు, ప్రకటనల కోసం RRBల అధికారిక వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలు, ముఖ్యమైన తేదీలతో సహా మరిన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వివరంగా వెల్లడిస్తామన్నారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ప్రాంతీయ RRBల అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని వెల్లడించారు.

అధికారిక ప్రకటన ఫైల్ : https://www.rrbajmer.gov.in/Upload_PDF/638423208075866721.pdf

Advertisment
Advertisment
తాజా కథనాలు