IPL auction: జాక్‌ పాట్‌ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం!

వెస్టిండిస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.11.5 కోట్లకు అమ్ముడుపోయాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది.

New Update
IPL auction: జాక్‌ పాట్‌ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం!

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఇప్పటివరకు కప్‌ లేదు. ప్రతీసారి నెక్ట్స్‌ సాల కప్‌ నామ్‌దే అని చెప్పుకోవడం తప్ప డైలాగ్‌ కూడా మార్చుకోలేని దుస్థితి వారి ఫ్యాన్స్‌ది. జట్టులో హేమాహేమీలున్నా జట్టు కూర్పు విషయంలో బెంగళూరు అనేక తప్పిదాలు చేస్తుంటుంది. బ్యాటర్లు ఉంటే బౌలర్లు సరిగ్గా ఉండరు.. ఒకవేళ అన్నీ సెట్‌ అయినా దరిద్రం వెంటాడి ఓడిస్తుంది. అందుకే దోష నివారణ చేసుకుంటే మంచిదని పలువురు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అప్పుడప్పుడు RCBని ట్రోల్ చేస్తుంటారు. నిజానికి RCB ప్రధాన సమస్య సరైన బౌలర్లు లేకపోవడం. చిన్న సైజులో ఉండే చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్లు ఇరగదీసి బ్యాటింగ్‌ చేయడం.. 200కు పైగా భారీగా స్కోరు చేయడం.. సరైన బౌలర్లు లేక ఓడిపోవడం RCBకి అలవాటు. ఇదే స్టోరీ ఎన్నో సీజన్లగా జరుగుతోంది. గత(2023) సీజన్‌లో సిరాజ్‌ పర్వాలేదనిపించాడు. అయినా విన్నింగ్‌ కాంబినేషన్‌ టీమ్‌తో ఆడలేదు. అందుకే ఈసారి ఆక్షన్‌లో పేసర్లపై దృష్టి సారించింది.

వెస్టిండిస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.11.5 కోట్లకు అమ్ముడుపోయాడు. ఈ వెస్టిండీస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభ పోటీలో ఉన్నాయి. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11.5కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.

జోసెఫ్ ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు. 2019లో జోసెఫ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) తరపున అదరగొట్టాడు 3.4-1-12-6 గణాంకాలతో ఔరా అనిపించాడు. ఐపీఎల్‌లో 19 మ్యాచుల్లో జోసెఫ్ 9.19 ఎకానమీ రేటుతో 20 వికెట్లు తీశాడు. RCB తాజాగా కొనుగోలు చేయడానికి ముందు గుజరాత్ టైటాన్స్ (GT)తో ఉన్నాడు. జోసెఫ్ ఇటీవల ఇంగ్లండ్‌తో మూడు టీ20లు ఆడాడు. ఆ తర్వాత సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు జోసెఫ్‌ సిద్ధమవుతున్నాడు.

Also Read: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు ధర.. రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్!

Advertisment
Advertisment
తాజా కథనాలు