Flipkart Big Billion days 2023: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇంకా మొదలు కాకపోయినా..దాని ప్రభావం అప్పుడే కనపడుతుంది. ఇప్పటికే ఈ బిలియన్ డేస్ లో ఆఫర్ల గురించి ప్రముఖులందరూ యాడ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. హిందీలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తెగ ప్రచారం చేసేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించేందుకు రెడీ అయిపోయింది. ఈ ఏడాది సేల్ కి సంబంధించి అమితాబ్ బచ్చన్ తో ఓ ప్రకటన రెడీ చేసి విడుదల చేసింది.
Also read:సంక్రాంతి బరిలోకి విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఈ ప్రకటన పై పెద్ద వివాదం నెలకొంది. అఖిల భారత వర్తకుల సమాఖ్య ఈ ప్రకటన గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. వెంటనే దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీపీఏ కి లేఖ రాసింది. ప్లిప్ కార్ట్ విడుదల చేసిన ప్రకటన దేశంలో ఉన్న చిన్న వ్యాపారులకు వర్తకులకు వ్యతిరేకంగా ఉందని ఆ సంస్థ పేర్కొంది.
వెంటనే ఆ ప్రకటనను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద వెంటనే ఫ్లిప్ కార్ట్ మీద జరిమానా విధించాలని, అలాగే ప్రకటనలో నటించిన అమితాబ్ బచ్చన్ కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించాలని డిమాండ్ చేసింది.
‘‘చట్టంలోని సెక్షన్ 2(47) కింద పేర్కొన్న నిర్వచనం ప్రకారం.. భారత మార్కెట్లో విక్రయదారులు, సరఫరాదారులు మొబైల్ ఫోన్లను ఏ ధరలకు అందుబాటులో ఉంచుతున్నారనే విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే మాదిరిగా ఫ్లిప్ కార్ట్ వ్యవహరించింది. ఇది స్పష్టంగా మరో వ్యక్తి విక్రయించే వస్తు, సేవలను కించపరిచే విధంగా ఉంది’’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ కండేల్వాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: గూగుల్ నుంచి కిరాక్ మొబైల్ వచ్చింది మావా.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు