Metro: మెట్రో ఫేజ్-2 విస్తరణ రూట్‌మ్యాప్ విడుదల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. By srinivas 22 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. ఫేజ్-2 విస్తరణలో భాగంగా చాంద్రయాణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగించారు. నాలుగు కారిడార్లలో.. ఈ మేరకు జేబీఎస్ (JBS) నుంచి ఎంజీబీఎస్ (MGBS) ఉన్న రెండో కారిడార్ చాంద్రయాణగుట్ట వరకు పొడిగిస్తూ ప్రతిపాదించారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కారిడార్-2లో ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి ఫలక్‌నుమా (FalaknumaMGB) వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు నిర్మించనున్నారు. కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు వేయాలని సూచించారు. #Hyderabad- Route map for Hyderabad Metro (Phase 2) is finalised. The Chief Minister ordered the scrapping of the metro rail routes which were proposed by the previous government. New Metro Rail Route Map. Corridor 2 : MGBS Metro Station to Falaknuma (5.5 kms) Corridor… pic.twitter.com/0byN63T0dx — @Coreena Enet Suares (@CoreenaSuares2) January 22, 2024 ఇది కూడా చదవండి: Cook: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్.. అలాగే నాగోల్, ఎల్‌బీనగర్, చాంద్రయాణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో వెళ్లేలా ప్రతిపాదించారు. ఇదే కారిడార్-4లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు, కారియర్-5లో రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు.. రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో లైన్ వేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ఎల్‌బీనగర్-హయత్‌నగర్.. కారిడార్-6లో మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్ల, మియాపూర్, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో లైన్ వేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. కారిడార్-7లో ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్ల వరకు.. ఎల్‌బీనగర్, వనస్థలీపురం, హయత్‌నగర్ వరకు మెట్రో వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. #hyderabad-metro #mgbs #phase-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి