MLC Kavitha: కవితకు జైలా? బెయిలా?.. కొనసాగుతున్న సస్పెన్స్!

TG: లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్ సరిగ్గా లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు.

New Update
MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస నిరాశలే మిగులుతున్నాయి.తాజాగా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. లిక్కర్ స్కాం కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ కక్షతోనే ఇలా చేశారని, చార్జిషీటే సరిగా లేదని.. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ పై నిన్న (సోమవారం) విచారణ చేపట్టింది ధర్మాసనం.

కాగా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని, తమకు సమయం కావాలని కవిత తరపున న్యాయవాది కోరగా, బుధవారం తుది వాదనలు వినిపించాలని జడ్జి ఆదేశించారు. ఇదే కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రెండు సార్లు కొట్టేసిన ధర్మాసనం రేపు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. మరి కవితకు అనుకూలంగా తీర్పు వస్తుందా? లేదా అనేది వేచి చూడాలి. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : నేడు అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి

Advertisment
తాజా కథనాలు