Valentine Week - Kiss Day : ఒక ముద్దు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని మీకు తెలుసా!

ముద్దు కూడా శరీరం, మనస్సును నయం చేయడంలో సహాయపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి. ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రజలను సంతోషంగా ఉంచుతుంది.

 Valentine  Week - Kiss Day : ఒక ముద్దు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని మీకు తెలుసా!
New Update

Kiss : ఓ వ్యక్తి తన జీవితంలో ముందుకు సాగాలంటే ఆ జీవిత సమయంలో ఎన్నో సంతోషాలను, దుఃఖాలను కూడా దాటాల్సి ఉంటుంది. సంతోషంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరితోనైనా మంచిగా, ప్రేమగా మాట్లాడటం ద్వారా సంతోషంగా ఉంటారు. ఆ జీవితంలోనే ప్రేమ(Love) అనే అనుభూతిని కూడా పొందుతాడు.

అమితంగా ఇష్టపడే వ్యక్తి గొంతు విన్నా, పేరు విన్నా చాలు ఆటోమేటిక్‌ గానే అవతలి వారి మోము చిరునవ్వులు చిందాడతాయి. ఒకరి ఆలోచనల్లో కూరుకుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారితో ఒక్క క్షణం ఉన్నా చాలు... ఆ క్షణం జీవితాంతం సంతోషంగా ఉంచుతుంది.

ముద్దు కూడా అటువంటి ప్రేమపూర్వక అనుభూతే. ఇది మిమ్మల్ని లోపల నుండి స్వస్థపరచడానికి పని చేస్తుంది. అది బిడ్డ, తల్లి ప్రేమ అయినా ప్రేమికుడు, స్నేహితురాలి ప్రేమ అయినా, ముద్దు అన్ని కోపాల్ని క్షణంలో తొలగించగలదు. ఒకరిని ప్రేమగా ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రేమతో పాటు ముద్దుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో(Kissing Benefits) తెలుసుకుందాం.

హెల్త్‌లైన్(Healthline) నివేదిక ప్రకారం, ఒకరిని కౌగిలించుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముద్దు కూడా శరీరం, మనస్సును నయం చేయడంలో సహాయపడుతుంది.ఎవరైనా మిమ్మల్ని ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు(Happy Hormones) పెరుగుతాయి. ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రజలను సంతోషంగా ఉంచుతుంది.

ఆందోళన నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాదు, ముద్దులు పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ముద్దు ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి -

ముద్దు మెదడులో రసాయనాల కాక్టెయిల్‌ను విడుదల చేస్తుంది, దీని కారణంగా శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మనుషుల ముఖాల్లో సంతోషం కలుగుతుంది.

ఒత్తిడి , ఆందోళనను తొలగిస్తుంది -

కౌగిలింత, ప్రేమపూర్వక ముద్దు రోజు ఒత్తిడి, సమస్యలను తొలగిస్తుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారికి, ముద్దు చికిత్స కంటే తక్కువ కాదు.

రక్తపోటు నియంత్రణలో

మీరు ఎవరినైనా ముద్దుపెట్టుకున్నప్పుడు, హృదయ స్పందన గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణ బాగా జరగడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది-

రోజూ ముద్దు పెట్టుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు, కొన్ని కొత్త క్రిములు మీ నోటిలోకి ప్రవేశిస్తాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అనేక కొత్త జెర్మ్స్‌తో పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది -

కిస్ గుండె, మెదడు రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇది గుండెపోటు(Heart Attack), స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రొమాంటిక్ కిస్(Romantic Kiss) శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

Also Read : మీ ప్రియమైన వారిని ”ముద్దు” మురిపాలలో ముంచెత్తండి!

#kiss-day #kissing-benefits #romantic-kiss #lifestyle #health-benfits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe