Shivam Dube: టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్‌కు టీమ్ ఇండియా ఈసారి నలుగురు ఆల్ రౌండర్లను సెలక్ట్ చేసింది. సీనియర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్, శివమ్ దూబేకు కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఐపీఎల్ (IPL) 2024 మధ్యలోనే టీమ్ సెలక్షన్‌ను ఫైనల్ చేశారు.అప్పటికి ఐపీఎల్‌లో ఇరగదీస్తున్న శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వడమే కరెక్ట్ అని అందరూ అనుకున్నారు.
కానీ అతన్ని ఫైనల్ ఎలెవెన్‌కు సెలక్ట్ చేయడమే రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన పెద్ద తప్పు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో డక్ ఔట్ అవ్వడంతో దూబేపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో అప్పటి వరకు సత్తా చాటిన దూబే, వరల్డ్ కప్ స్క్వాడ్‌కు (T20 World Cup 2024) ఎంపికైన తర్వాత లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ ఆడిన టీమ్ ఇండియాలో అతడు రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నాడు.కానీ తనదైన మార్క్ ఇప్పటికీ వేయలేదు.
నిజానికి రింకూ సింగ్ (Rinku Singh) వంటి వారిని కాదని దూబేను సెలక్ట్ చేయడమే చర్చనీయాంశంగా మారింది. కానీ టోర్నీలో సక్సెస్ అయ్యి విమర్శకుల నోర్లు మూయిస్తాడనుకుంటే, ఎప్పుడూ ఆ పని చేయలేక విమర్శలను కొని తెచ్చుకుంటున్నాడు.రోహిత్ నిర్ణయం రివర్స్ అయిందా? : ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు దూబే కన్సిస్టెన్సీ మెయింటెన్ చేయలేదు. టోర్నీలో అతడి స్కోర్లు చూస్తే.. ఇప్పటి వరకు 0, 28, 34, 10, 31*, 3, తాజాగా నిన్నటి గోల్డెన్ డక్ ఉంది. నిజానికి బంగ్లాదేశ్‌పై అతడు బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అంచనాలను మాత్రం అందుకోలేదు.
ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో చాలా బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. టాప్ ఆర్టర్ మాదిరిగా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉండదు. కానీ దూబే మాత్రం ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించట్లేదు.టోర్నీలో ఇప్పటి వరకు శివమ్ దూబే 21.2 యావరేజ్, 106 స్ట్రైక్ రేట్‌తో కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు. మిడిల్ ఓవర్లలో టీమ్‌కు బ్యాక్ బోన్‌గా ఉండాల్సిన ఈ ఆల్ రౌండర్, ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. అతడు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ పరిశీలిస్తే.. అతన్ని ఫైనల్ ఎలెవెన్‌లో కచ్చితంగా ఆడించాలని రోహిత్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది.
నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో దూబేపై ఒత్తిడి క్లియర్‌గా కనిపించింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి, గోల్డెన్ డక్ అయ్యాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో ఒకే ఒక బాల్ ఆడి కీపర్ క్యాచ్ ఇచ్చాడు. దూరంగా వెళ్తున్న డెలివరీని ఆడే ప్రయత్నం చేయగా, అది ఎడ్జ్ తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ క్యాచ్ పట్టాడు. పేస్ బౌలింగ్‌లో సరిగా ఆడలేని అతని బలహీనత మరోసారి బయటపడింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు అయినా అతని స్థానంలో వేరొకరిని ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
Also Read: ఐపీఎల్ కోసం కోహ్లీ.. ఇండియా కోసం రోహిత్: ఈ రికార్డులే సాక్ష్యం!