No more Rohit Sharma in white-ball formats? ఎవరు ఔనన్నా కాదన్నా టీమిండియాను నడిపించిన గొప్ప కెప్టెన్లలో రోహిత్(Rohit Sharma) ఒకడు. నాయకుడిగా రోహిత్ తానెంటో ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడినా కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి మార్కులే పడ్డాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఫైనల్‌లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అటు రోహిత్ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ సంతృప్తిగానే ఉన్నా భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా వన్డే కెప్టెన్సీని రోహిత్ వదులుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.
వైట్ బాల్ ఆడడా?
వైట్ బాల్ క్రికెట్(వన్డే,టీ20)లో రోహిత్ కొనసాగుతాడా లేదా అన్నదానిపై ప్రముఖ మీడియా సంస్థ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పలు కథనాలను ప్రచురించింది. రోహిత్ వన్డే కెప్టెన్సీని వదులుకుంటాడని ఈ కథనాలు చెబుతున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి రిజైన్ చేస్తాడన్న విషయాన్ని కూడా ముందుగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'నే చెప్పింది. ఇక ఈ విషయం గురించి ఇప్పటికీ బీసీసీఐతో రోహిత్ చర్చించాడని తెలుస్తోంది. వైట్ బాల్‌లో వన్డేలు ఆడేందుకు రోహిత్ ఆసక్తిగానే ఉన్నాడని.. అయితే అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకునేందుకు తనకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పినట్లు సమాచారం.
చాలా కాలంగా దూరంగానే:
నిజానికి రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా కొంతకాలంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌పై ఆడిన మ్యాచ్ ఈ ఇద్దరికి ఆఖరిది. ఇక టీ20లు యంగ్‌స్టర్స్‌కు మంచి ఫ్లాట్‌ఫారమ్. ఎంతోమంది పొట్టి ఫార్మెట్ నుంచి ఇతర ఫార్మెట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం రోహిత్ వయసు 36. దీంతో అతను అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండే ఛాన్స్‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కోహ్లీ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read: ‘మోదీ శని టీమిండియాకు తగిలింది..’ రాహుల్ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..!
WATCH: