Rohit Sharma : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!

తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించిన రోహిత్...తాను ఎప్పుడైతే సరిగ్గా ఆడటం లేదని భావిస్తానో అప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానంటూ పేర్కొన్నాడు.

Rohit Sharma : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!
New Update

Rohit Sharma :  భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో , టీమ్ ఇండియా వన్డే ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా ఆడింది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రోహిత్ శర్మ దాదాపు రెండు నెలల పాటు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాడు. ఆయన రిటైర్మెంట్‌పై వార్తలు వైరల్ అయ్యాయి. అనూహ్యంగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో టెస్టు జట్టులోకి వచ్చాడు.అంతేకాదు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి సెంచరీ కూడా చేశాడు.

ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడి.. జట్టును 4-1తో గెలిపించాడు. ధర్మశాలలో సిరీస్ గెలిచి , ఐదో టెస్టులో విజయాన్ని నమోదు చేసుకున్న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రశ్నపై మౌనం వీడాడు. మ్యాచ్ తర్వాత జియో సినిమాపై రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్లాన్‌పై మాట్లాడుతూ.. ఎప్పుడైతే నేను సరిగ్గా ఆడటం లేదని భావిస్తానో అప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానంటూ చెప్పుకొచ్చారు.నేను గణాంకాల గురించి అస్సలు పట్టించుకోను. జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడటంపై ఫోకస్ పెడగాను. నేను కొంత మార్పు తీసుకురావాలని భావిస్తున్నానను. ఆటగాళ్లు చాలా స్వేచ్చగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్ కాదు కావాల్సింది..నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు ఆటోమెటిగ్గా అవే వస్తాయని రోహిత్ శర్మ వివరించారు.

గత రెండు-మూడేళ్లలో నేను నా ఆటను మెరుగుపరుచుకున్నానని అనుకుంటున్నాను అంటూ వివరించాడు. గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్‌లో కూడా సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ రెండు సెంచరీలు చేశాడు.కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు 59 టెస్టులు, 262 వన్డేలు , 151 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను టెస్టుల్లో 12 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలతో సహా 4138 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో 10709 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో రోహిత్ 5 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలతో 3974 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 2007 నుంచి వన్డే, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

ఇది కూడా చదవండి: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు కోల్పోయాడంటే.!

#rohit-sharma #india-vs-england #rohit-sharma-retirement
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe