ICC One Day Rankings: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) 3వ స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దుబాయ్‌లో ఉత్తమ వన్డే ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో, అతను 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధసెంచరీలతో సహా 157 పరుగులు (‘స్ట్రైక్ రేట్’ 141.44) చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli) చెత్త ప్రదర్శనతో (752) 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ (824 పాయింట్లు), భారత్‌కు చెందిన శుభమన్ గిల్ (782) తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు.
Rohit: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3 వస్థానంలో రోహిత్ శర్మ!
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ 3వ స్థానానికి ఎగబాకాడు.రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేశాడు.
Translate this News: