T20 World Cup 2024: ఫాంలో పంత్, కుల్దీప్..రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలం! టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ లో పంత్, కుల్దీప్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వీరిద్దరు నిన్నటి మ్యాచ్ లో చెలరేగడంతో జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. By Durga Rao 13 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐపీఎల్ 2024 (IPL 2024)లో వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.ఇక, ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో.. ఐపీఎల్‌పై ఓ కన్నేశారు బీసీసీఐ సెలెక్టర్లు. ధనాధన్ లీగ్‌లో రాణించిన కుర్రాళ్లకి పొట్టి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కూడా ఐపీఎల్ పై ఓ కన్నేశారు. అయితే, టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు అదిరిపోయే న్యూస్. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరమైన రిషబ్ పంత్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పాత రిషబ్ పంత్‌ను అభిమానులు చూస్తున్నారు.తన రేంజ్ షాట్లతో అలరిస్తున్నాడు ఈ పాకెట్ డైనమైట్. లక్నోతో జరిగిన మ్యాచులో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్‌కి విజయాన్ని అందించాడు. 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.ఇక, ఈ సీజన్‌లో ఆరు మ్యాచుల్లో 194 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 157.72. ఈ గణంకాలు చూస్తే.. రిషబ్ పంత్ కమ్ బ్యాక్ అనిపిస్తుంది. ఇదే ఫామ్ మిగతా మ్యాచుల్లో కూడా కంటిన్యూ చేస్తే టీ20 ప్రపంచకప్ రేసులో ఉంటాడు. రిషబ్ పంత్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా చెలరేగడం రోహిత్ శర్మకు ప్లస్ పాయింట్. కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ బౌలర్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. లక్నోతో జరిగిన మ్యాచులో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.గాయం కారణంగా గత రెండు మ్యాచులకు దూరమైన కుల్దీప్.. వచ్చి రావడంతోనే తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇద్దరూ ఫామ్‌లోకి రావడం రోహిత్ శర్మకు వెయ్యి ఏనుగుల బలం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. #rohit-sharma #t20-world-cup-2024 #rishabh-pant #bcci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి