/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-6-2-jpg.webp)
Rohit Sharma on His Retirement Plans: భారత సారథి రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇండియా టీమ్ సీనియర్లలో ఒకడైన హిట్ మ్యాన్ త్వరలోనే క్రికెట్ కు ముగింపు పలకబోతున్నట్లు ఇటీవల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం 36 ఏళ్లున్న రోహిత్ వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడకపోవచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. టీ 20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత తప్పుకుంటాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తరుణంలో స్వయంగా రోహిత్ తన వీడ్కోలుపై క్లారిటీ ఇచ్చాడు.
𝗢𝗳𝗳 𝘁𝗵𝗲 𝗺𝗮𝗿𝗸 🏁 pic.twitter.com/9Zo5heBN80
— Rohit Sharma (@ImRo45) April 7, 2024
ప్రస్తుతానికైతే బాగానే ఆడుతున్నా..
ఈ మేరకు బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో ఛాట్ చేసిన హిట్ మ్యాన్.. రిటైర్మెంట్ అంశాన్ని ప్రస్తావించాడు. ఇండియాకు మరో వన్డే వరల్డ్‌కప్ అందించాలనే ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ గెలిచి కప్ కొట్టాలని చూస్తున్నట్లు చెప్పాడు. అంతేతప్పా తాను ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించట్లేదని, జీవితం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదన్నాడు. ఇక ప్రస్తుతానికైతే బాగానే ఆడుతున్నానని, మరికొన్ని ఏళ్ల పాటు ఇలాగే ఆడాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు ఇకనైనా చెక్ పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
Thoda rang, Thoda maza 🔫 pic.twitter.com/zzEnHlsvgw
— Rohit Sharma (@ImRo45) March 25, 2024
Also Read: రిషబ్ పంత్ ను మోసం చేసిన ఊర్వశీ.. మరొకరితో లవ్ ట్రాక్.. ఫొటో వైరల్!