Rohit Sharma: 5 మ్యాచ్‌ల్లో నాలుగు గుడ్లు పెట్టిన కెప్టెన్.. ఇలాగైతే కష్టమే! అఫ్ఘాన్‌పై రెండో టీ20లో డకౌటైన రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ఛేజింగ్‌లో చివరి 5 టీ20I మ్యాచ్‌ల్లో రోహిత్ ఇలా డకౌట్ అవ్వడం ఇది నాలుగో సారి. ఇక వన్డేల్లో చివరి 10మ్యాచ్‌ల్లో 59 యావరేజ్ కలిగి ఉన్న రోహిత్.. టీ20Iల్లో మాత్రం 15మాత్రమే కలిగి ఉన్నాడు. By Trinath 15 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రస్తుత భారత్ జట్టులో ఎవరు అంగీకరించినా, ఒప్పుకోకున్నా రోహిత్ శర్మ(Rohit Sharma)ను మించిన కెప్టెన్ లేడు. అతని కెప్టెన్సీ గణాంకాలే ఇందుకు సాక్ష్యం. టీ20, వన్డే, టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఓవైపు ఘన విజయాలు సొంతం చేసుకుంటున్నా.. పొట్టి ఫార్మెట్‌లో బ్యాటర్‌గా మాత్రం రాణించలేకపోతున్నాడు. వన్డేల్లో అతను బ్యాట్‌లో పదును రోజురోజుకు పెరుగుతుంటే.. టీ20ల్లో మాత్రం అసలు పదునే లేని కత్తిలా కనిపిస్తోంది. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లోనూ రోహిత్ ఫెయిల్ అవుతున్నాడు. నిన్నటి అఫ్ఘాన్‌పై రెండో టీ20 విజయం కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో 41వది. అంతకముందు ధోనీ మాత్రం సరిగ్గా 41 టీ20I విజయాలు సాధించాడు. అయితే బ్యాటర్‌గా మాత్రం రోహిత్ మరో సారి డకౌట్ అయ్యాడు. డబుల్ డక్స్.. కాదు కాదు.. క్వాడ్రాపుల్ డక్స్: మొహాలీ వేదికగా అఫ్ఘానిస్థాన్‌పై జరిగిన తొలి టీ20లో శుభమన్‌గిల్ తప్పిదం కారణంగా రనౌటై.. డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్.. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో బౌల్డ్ అయ్యాడు. అది కూడా గోల్డెన్ డక్. ఇలా వరుస పెట్టి ఈ సిరీస్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక ఈ డక్‌తో రోహిత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ఛేజింగ్‌లో గత 5 టీ20 ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఇలా డకౌట్ అవ్వడం ఇది నాలుగో సారి. మరో మ్యాచ్‌లోనూ అతని స్కోర్ 4 మాత్రమే. అంటే ఛేజింగ్ చివరి 5 మ్యాచ్‌ల్లో(టీ20I) రోహిత్ శర్మ చేసింది నాలుగు పరుగులే. అంటే యావరేజ్ ఒకటి(1) కూడా లేని పరిస్థితి. వన్డేల్లో ఒకలా.. టీ20ల్లో ఇంకోలా: ఇక రోహిత్ బ్యాటింగ్ గణాంకాలను వన్డేలు, అంతర్జాతీయ టీ20లు పోల్చి చూస్తే అతను పొట్టి ఫార్మెట్‌లో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. చివరి 10 వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ 59.70 యావరేజ్‌తో 597 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 127.56 ఉండడం విశేషం. ఇటు చివరి 10 టీ20I మ్యాచ్‌ల్లో రోహిత్ కేవలం 159 రన్సే చేశాడు. అతని యావరేజ్ 15.90మాత్రమే. స్ట్రైక్‌రేట్ కూడా 105.29గానే ఉంది. వన్డేల్లో 127 స్ట్రైక్‌రేట్ కలిగిన ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ ఉన్నా వారి యావరేజ్ తక్కువగా ఉంటుంది. అటు వన్డేల్లో యావరేజ్‌తో పాటు స్ట్రైక్‌రేట్ కూడా అద్భుతంగా కలిగి ఉన్న రోహిత్ గత 10 టీ20Iల్లో మాత్రం టెయిలండర్ స్థాయి గణాంకాలను కలిగి ఉన్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ ఉండగా.. ఈ తరహా బ్యాటింగ్ తీరుతో రోహిత్‌ను పొట్టి ఫార్మెట్‌లో ఉంచుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. Also Read: దుమ్మురేపిన దూబే, జైస్వాల్… 94 బంతుల్లో మ్యాచ్‌ను ముగించిన భారత్..!! WATCH: #rohit-sharma #cricket #cricket-news #india-vs-afghanistan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి