Cricket: ఐపీఎల్ కోసం కోహ్లీ.. ఇండియా కోసం రోహిత్: ఈ రికార్డులే సాక్ష్యం!

ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ లో ఓపెనర్ గా అదరగొట్టిన విరాట్ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్నాడు. మరో ఎండ్ లో ఐపీఎల్ లో నిరాశపరిచిన రోహిత్ ఒంటిచేత్తో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. వీరి ఆటతీరుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

New Update
Cricket: ఐపీఎల్ కోసం కోహ్లీ.. ఇండియా కోసం రోహిత్: ఈ రికార్డులే సాక్ష్యం!

Virat Kohli - Rohit Sharma: ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ ఫామ్ తన అభిమానులు, క్రికెట్ లవర్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup), ఇటీవల జరిగిన ఐసీఎల్ లోనూ దుమ్మురేపి విరాట్ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఎండ్ లో ఐపీఎల్ లో నిరాశపరిచిన రోహిత్ ఒంటిచేత్తో భారత్ ను ఫైనల్ కు చేర్చగా ఇద్దరి ఆటతీరుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

విరాట్ కోహ్లీ గతేడాది 2023 వన్డే వరల్డ్ కప్, 2024 ఐపీఎల్ సీజన్ లోనూ అత్యధిక పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో (IPL 2024) అత్యధికంగా 741 ర‌న్స్ చేసిన కోహ్లీ ఫామ్ ఇండియన్స్ ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ టోర్నీలో ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 75 ర‌న్స్ మాత్రమే చేశాడు విరాట్. దీంతో కోహ్లీ బ్యాటింగ్‌పై విమ‌ర్శలు వస్తున్నాయి. కోహ్లీ 1, 4, 0, 0, 9 పరుగులకే పెవిలియన్ చేరడంపై సర్వత్ర ఇక వీడ్కోలుకు సమయం ఆసన్నమైదంటూ సూచిస్తున్నారు. మరికొందరు అతను డబ్బులకోసమే కష్టపడతాడని, దేశంకోసం కాదంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వన్డే 2023 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ చేరడానికి కోహ్లీనే కీలమనే విషయం మరవొద్దని, అతని టాలెంట్ గురించి విమర్శించే హక్కు ఎవరికీ లేదంటూ విరాట్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఒక్కసారి కోహ్లీ రికార్డులు, గెలిపించిన కీలక మ్యాచ్ లు, లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ లో పాక్ పై (Pakistan) మ్యాచ్ గుర్తుకు తెచ్చుకోవాలంటూ విమర్శల నోర్లు మూయిస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్ లో దారుణంగా విఫలమైన రోహిత్.. వరల్డ్ కప్ లో (T20 World Cup 2024) అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఒక్కడే 92 పరుగులు చేసి ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఆ తర్వాత అదే ఫామ్ ను కొనసాగిస్తూ సేమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్పటి వ‌ర‌కు  248 ర‌న్స్ చేసిన రోహిత్.. ఇండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. దేశం కోసం ఎంతో కష్టపడతాడని,స్వార్థం లేని నిజమైన నాయకుడంటూ పొగిడేస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ ఇప్పటి వరకూ 155.97 స్ట్రక్ రేట్ తో 248 రన్స్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక సిక్స్ లు 15, 22 ఫోర్లు బాది బౌండరీలలో మొదటి ప్లేస్ లో నిలిచాడు. అంతేకాదు ఇండియా తరఫును 3 అర్థ సెంచరీలు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 92 కూడా రోహిత్ దే కావడం విశేషం.

అయితే ఫామ్‌లో లేని కోహ్లీకి (Virat Kohli) కోచ్ ద్రావిడ్‌, కెప్టెన్ రోహిత్ అండ‌గా నిలిచారు. కొంత రిస్కీ క్రికెట్ ఆడిన‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో క‌లిసి రాదు అన్నారు. అత‌ను ఏ ఆలోచ‌న‌తో ఆడుతున్నాడో, దాన్ని ఇష్టప‌డుతున్నట్లు ద్రావిడ్ తెలిపాడు. ముందు మ‌రో భారీ మ్యాచ్ ఆడాల్సి ఉంద‌ని, అత‌ని ఆటిట్యూడ్ న‌చ్చిన‌ట్లు చెప్పాడు. శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్లో కోహ్లీ రాణిస్తాడ‌ని కెప్టెన్ రోహిత్ అన్నాడు. అత‌నో నాణ్యమైన ప్లేయ‌ర్ ని, కొన్ని సంద‌ర్భాల్లో ఏ ఆట‌గాడైనా ఒడిదిడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్ద మ్యాచుల్లో అత‌ను ఉండ‌డం కీల‌క‌ం. ఫామ్ అనేది స‌మ‌స్య కాదు. ఎందుకంటే 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ర‌న్స్ చేయాల‌న్న త‌ప‌న అత‌నిలో ఉందన్నాడు రోహిత్.

Advertisment
తాజా కథనాలు