Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది.
పల్టీలు కొట్టిన కారు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుయ్యింది. ప్రమాదం జరిగిన విషయం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనదే తెలియాల్సి ఉంది.
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. హైవే పై స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు పీవీఎన్‌ఆర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ తెలిపారు.
Also read: నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!