/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/accident-1-1-jpg.webp)
ORR Accident: హైదరాబాద్ రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుపై భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వెళుతున్న కారు డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ వద్ద వేగంగా వెళ్తున్న కారు ఢీవైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/jtZe2TSkk6
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2024
పోలీస్ అకాడమీ వైపు వెళుతున్న కారు..
ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళుతున్న కారు అతివేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికుల సాయంతో శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: Salman khan: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!
అందరూ యువకులే..
రోడ్డు ప్రమాదంతో ఔటర్ రింగ్ రోడ్‌పై వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారులో అందరూ యువకులే ఉన్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.