రహదారులు రక్తసిక్తం.. 2 ఘోర ప్రమాదాలు, ఏడుగురి మృతి

రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ప్రమాదాలు తీవ్ర విషాధాలకు కారణమయ్యాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

New Update
రహదారులు రక్తసిక్తం.. 2 ఘోర ప్రమాదాలు, ఏడుగురి మృతి

Tirupathi Accident: రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ప్రమాదాలు తీవ్ర విషాధాలకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోటలో ఆగివున్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కారు తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ఆన్ లైన్ జాబ్స్ పేరుతో ఎర.. బీ కేర్ ఫుల్ అంటున్న పోలీసులు!

తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో జరిగిన మరో ఘటనలో కారును స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బంధువుల రోదనలతో ప్రమాద స్థలంలో విషాధకరమైన వాతావరణం ఏర్పడింది. అతి వేగం ప్రమాదాలకు కారణమని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రజలను కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు