Road accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఇద్దరు మృతి, 18 మందిపైగా తీవ్రగాయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిగా, 18 మందికిపై తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికిలో చికిత్స కోసం తరలిచారు. ఒక్కరోజే మూడు చోట్లు ప్రమాదం చోటుచేసుకోవటంతో తీవ్ర కలకలంగా మారింది.

Road accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఇద్దరు మృతి, 18 మందిపైగా తీవ్రగాయాలు
New Update

బొలేరో వ్యాన్‌-ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వ్యాన్‌-ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. యర్నగూడెం గండి చెరువు వద్ద నల్లజర్ల వెళ్తున్న బొలేరో వాహనాన్ని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న సమన్వి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా ఢీకొనటంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 26 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న సమన్వి ట్రావెల్స్ బస్సు.  అదే సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి వాహనాలు తగలటంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే మరియు 108 నందు వైద్యచికిత్స నిమిత్తం గోపాలపురం వైద్యశాలకు తరలించారు.

This browser does not support the video element.

పొలం పనులకు వెళ్తుండగా..

కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటోను కారు ఢీ కొన్నది. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బద్వేలు నుంచి రాజుపాలెం పొలం పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

This browser does not support the video element.

డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం అతివేగం..

తెలంగాణలోని ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు వరంగల్ వైపు వస్తుండగా జంగాలపల్లి క్రాస్ వద్ద వారు తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో ప్రయాణిస్తున్న కారు స్విఫ్ట్ డిజైర్ ఒకసారి అదుపుతప్పి పశువుల సంత ముందు, ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్, స్ట్రీట్ లైట్లు ఢీ కొట్టి మల్టీ కొట్టింది. ఈ ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ములుగు సీఐ,ఎస్ఐలు క్షతగాత్రులను 108 ద్వారా ములుగు ఏరియాతో తరలించారు. గాయపడినవారిని ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం అతివేగం ప్రమాదం కారణమని స్థానికులు అంటున్నారు.

#kadapa #east-godavari-district #18-seriously-injured #road-accident-in-telugu-states-2-dead #mulugu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe