Accident: విహారయాత్రలో విషాదం.. ఆరుగురు దుర్మరణం

తమిళనాడు సింగిలిపట్టు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా సిమెంట్ లారీని ఢీ కొట్టింది. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు.

New Update
Accident: విహారయాత్రలో విషాదం.. ఆరుగురు దుర్మరణం

Tamil Nadu: కుటంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. పిల్లాపాపలతో ఆడుతూ పాడుతూ సరదాగా ప్రయాణం చేస్తున్న ఫ్యామిలీ ఊహించని ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లింది. స్థానికులు, జనాలను కలిచివేసిన ఈ భయంకరమైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని సింగిలిపట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది.

సిమెంట్ లారీని ఢీ కొట్టి..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని సింగిలిపట్టు ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుంటుంబానికి చెందిన వారు విహార యాత్రకు వెళ్లి తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలోనే సింగిలిపట్టు దగ్గరకు రాగానే అతివేగంగా వెళ్తున్న కారు అనుకోకుండా అదే రోడ్డుపై వెళ్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇక స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Allahabad: భర్త కూలీ అయినా భరణం చెల్లించాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు

డ్రైవర్ నిద్ర మత్తు..
మృతులను కార్తీక్‌, వేల్‌ మనోజ్‌, సుబ్రమణి, మనోహరన్‌, పోతిరాజ్‌లుగా గుర్తించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు