Road accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్‌లో ఎక్కడో ఒకచోట వరసగా రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయి. తాజాగా వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులు నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పాతబస్తీ బహుదూర్‌పూరా క్రాస్‌రోడ్ దగ్గర కలకలం రేపింది.

New Update
Road accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్‌లోని పాతబస్తీ బహుదూర్‌పూరా క్రాస్‌రోడ్ (Bahudoorpura Crossroad)  దగ్గర రోడ్డు ప్రమాదం (Road accident)  జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ తెలంగాణ ఆర్టీసీ బస్సు 9RTC bus ) ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ ( Bus brakes fail) కారణంగానే ఆటోను ఢీకొందని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. పెద్దగా ట్రఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

నాణ్యత లేని రోడ్డు

ఈనెల 13న బుధవారం హయత్‌నగర్‌ (Hayatnagar)లో రోడ్డు కుంగిన విషయం తెలిసిందే. నాణ్యత లేని రోడ్డు వేస్తే ఇలానే ఉంటుందని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని HP పెట్రోల్ బంక్ (HP Petrol Bunk) ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డు ఒక్కసారిగాకుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు ( Traffic police) బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి (Corporator Kallem Navajeevan Reddy) పరిశీలించారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే నాణ్యత లేకుండా రోడ్లు వేసి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారని మండిపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.

నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం

దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లాంటి మహానగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరగటం నగరవాసుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. రోడ్లు దెబ్బతినడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని ప్రజల ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో నిమజ్జనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మరల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు