/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)
Road Accident : గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లా (Palnadu District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో మృతి చెందిన వారంతా కూడా గుంటూరు జిల్లాకు చెందిన వారని సమాచారం. వీరు పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా...ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం.. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం
(TTD) రిటైర్డ్ ఉద్యోగి అయిన సోమలి బాలగంగాధర్ శర్మ (78), ఆయన భార్య యశోద (67) తో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా శర్మ కుమారుడు శర్మ, ఆయన భార్య నాగ సంధ్య దంపతుల పిల్లలు కార్తీక్, అనుపమలు తీవ్రంగా గాయపడ్డారు.
వారిలో శర్మ, సంధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: ముందు మెట్రో ఎక్కండి..దిగాకే టికెట్ కొనండి..హైదరాబాద్ మెట్రో ఓపెన్ లూప్ టికెటింగ్!