Road accident: భద్రాద్రికొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. By Vijaya Nimma 12 Sep 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రెండు వాహనాలు ఢీ ఎదురెదురు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన ఇల్లందు మండలంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చ తండాకి చెందిన బానోత్ లక్ష్మణ్ (30) వృత్తి రిత్య ఫోటోగ్రాఫర్, అదేవిధంగా రోడ్లపాడు గ్రామానికి చెందినటువంటి, కోడెం, సంతోష్ (22), మాడే నాగరాజు(20) ఇల్లందు వెళ్తున్న క్రమంలో ఎదురెదురు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, సంతోష్ (22) అనే వ్యక్తిని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందారు. Your browser does not support the video tag. కన్నీటి పర్యంతం స్థానికుల సమాచారంతో ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మృతుల కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి చేరుకొని కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విధారకమైన సంఘటన చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. మృతుడు భూక్య లక్ష్మణ్ (30) స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్‌కు బంధువు కావడంతో విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వద్దకు ఎమ్మెల్యే చేరుకున్నారు. ప్రమాదంలో ముగ్గురు ఎలా చనిపోయారు అనే విషయంపై డాక్టర్లతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూసి ఆమె కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ముగ్గురు మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. యువకులు మద్యం మత్తులో బైక్ నడిపారా లేక.. నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. #road-accident #bhadradrikottagudem #three-killed #mla-haripriya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి