IPL: రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై స్పందించిన గవాస్కర్!

రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై మాజీ క్రిికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. అతను రీ ఎంట్రీ తో క్రికెట్ అభిమానులకు వినోదం పంచుతాడని ఆకాంక్షిస్తునాన్నారు. 14 నెలల విరామం తరువాత మైదానంలో కి అడుగుపెడుతున్న పంత్ భారీ స్కోరు చేసి ఫాంలోకి రావాలని కోరారు.

New Update
IPL: రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై స్పందించిన గవాస్కర్!

Sunil Gavaskar On Pant IPL Entry: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్  తమ మొదటి గేమ్‌ను పంజాబ్ కింగ్స్‌తో సాయంత్రం 3 గంటలకు ముల్లన్‌పూర్ స్టేడియంలో తలపడనుంది.డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ విధమైన పోటీ క్రికెట్ ఆడని పంత్ (Rishabh Pant)  ఆట ప్రారంభంలో గాడిలోకి రావాలని ఆశిస్తున్నాడు.

అయితే తాజాగా సునీల్ గవాస్కర్ పంత్ పై స్పందించాడు. “అతను తిరిగి మైదానంలోకి అడుగుపెడుతుండటంతో క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. అతను మైదానం బయట లోపల ఎల్లప్పుడూ ఎంటర్‌టైనర్‌గా ఉంటాడు. అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చిన క్షణం, ప్రతి ఒక్కరూ అతను బ్యాటింగ్‌ను చూడాలని కోరుకుంటారు. 16 నెలల విరామం తర్వాత, ఇది ఎవరికీ అంత సులభం కాదు. అతను తనకు తెలిసిన దానిలో 50 శాతం బ్యాటింగ్ చేయగలిగినా పంత్ అభిమానులకు వినోదాన్ని పంచుతారని చెప్పారు.  ఒన్ హ్యాండ్ సిక్స్‌లు పంత్ ఆటలో ప్రత్యేకమైనవని గవాస్కర్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) లో భారీ స్కోరును పంత్ సాధించాలని గవాస్కర్ ఆకాంక్షించారు.

Also Read: నేడు హైదరాబాద్ లో ఎర్త్‌ అవర్‌.. గంటపాటు కరెంట్ బంద్‌!

 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ నుండి  భారత జట్టుకు పంత్ దూరంగా ఉన్నాడు. నూతన సంవత్సరానికి ముందు తన స్వస్థలమైన రూర్కీకి తిరిగి వెళుతుండగా కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలనుంచి అతను కోలుకోవటానికి  అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. గాయాలు నయమైన తర్వాత, పంత్   జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి కఠోర శ్రమను ప్రారంభించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కే అందుబాటులోకి రావటానికి పంత్ ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు.

Advertisment
తాజా కథనాలు