India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్!

ఇంగ్లాండుతో మొదటి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ స్థానం భర్తీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇన్ ఫామ్ బ్యాటర్లు రజిత్ పాటిదార్, సర్ఫారాజ్ లతో పాటు పుజారా, రహానేల పేర్లు కూడా ప్రస్తావించబడుతున్నాయి. కానీ ఆకాశ్ చోప్రా మాత్రం రింకూ సింగ్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

New Update
India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్!

Ind vs Eng: ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్‌ల స్వదేశీ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ (Virat kohli) వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ స్థానం భర్తీపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇన్ ఫామ్ బ్యాటర్లు రజిత్ పాటిదార్, సర్ఫారాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా (Pujaara), అజింక్యా రహానే (Rahane) పేర్లు కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆటగాడు, వ్యాఖ్యత ఆకాష్ చోప్రా (Akah chopra) వీరందరినీ పక్కన పెట్టి మరో యంగ్ ప్లేయర్ అవకాశం ఇస్తే బాగుటుందంటున్నాడు.

రింకూ సింగ్ సరైనోడు..
ఈ మేరకు వైట్-బాల్ ఫార్మాట్‌లో ఇరగదీస్తున్న రింకూ సింగ్ (Rinku singh) ను సూచించాడు ఆకాశ్ చోప్రా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రింకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అందుబాటులో లేని కోహ్లి స్థానంలో అతని పేరును చేరిస్తే బాగుటుందన్నాడు. 'రింకూ సింగ్ ఇటీవల దక్షిణాఫ్రికాతో సీరీస్ కు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో స్థానం దక్కలేదు. అతను వన్ ట్రిక్ పోనీ కాదు. అతని ఫస్ట్-క్లాస్ రికార్డులు గమనిస్తే అతను కేవలం వైట్-బాల్ లేదా T20లకే పరిమితమైన ఆటగాడికా పరిగణించలేం' అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి:Cricket: అదే వ్యూహంతో రోహిత్ ను కట్టడిచేస్తాం.. మార్క్ వుడ్

ఫస్ట్ క్లాస్ రికార్డ్స్..
అంతేకాదు రింకూ ఇప్పటివరకు 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 57.57 సగటుతో 3109 పరుగులు చేశాడని, ఇందులో ఏడు సెంచరీలు 20 అర్ధసెంచరీలు ఉన్నాయని గుర్తు చేశాడు. అత్యధికంగా 163 నాటౌట్. అతను 50కి పైగా సగటును కలిగి ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు. కాబట్టి రింకూ సింగ్ ఎందుకు తీసుకోకూడదు? అని చోప్రా తన అభిప్రాయం వెల్లడించారు.

ఇక జనవరి 25న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రారంభం కానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో రింకూ భారత 'ఎ' జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. రింకూ ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

Advertisment
తాజా కథనాలు