T20 World Cup : జూన్ 2నుంచి టీ20 వరల్డ్ కప్ సంగ్రామం మొదలుకానుండగా.. అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించేశాయి. అయితే ఈసారి భారత జట్టు(Team India) సెలక్షన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ లవర్స్. ముఖ్యంగా భారత జట్టులో హార్దిక్ పాండ్య(Hardik Pandya) ను ఎంపిక చేయడంపై తీవ్రంగా విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీలు ఇప్పటికే తమ అభిప్రాయం వెల్లడించగా.. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తన మనసులో మాట బయటపెట్టాడు.
డానిష్ మాట్లాడుతూ.. పాండ్యను కాకుండా రింకుసింగ్‌ను తీసుకుంటే బాగుండేది. ఇండియా యశస్వి జైస్వాల్, రఘువంశీ, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ లాంటి ప్రతిభవంతులున్నారు. రింకు సింగ్ కూడా ఇలాంటి క్రికెటరే. అతనికి ఈసారి అవకాశం ఇస్తారని ఆశించా. కానీ భారత్ ఆ అవకాశం ఇవ్వలేదు. దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం. వీరిద్దరూ లోయర్ ఆర్డర్‌లో టీమ్‌ఇండియాకు బలంగా ఉండేవారు. హార్దిక్‌ను పక్కనపెడితే బాగుండేది. అతడు ఫామ్ లో లేడు' అన్నాడు.